మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేద్దామంటే కొందరు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని శనివారం రైతు పండుగలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేను ప్రభుత్వాన్ని పాలించే పనిలో పడితే అలుసుగా తీసుకుంటున్నారు. ఎవరి బెదిరింపులకు భయపడనని, నేను భయపడితే ఇంత దూరం రాను. పుట్టింది, పెరిగింది నల్లమల్ల అడవుల్లో పులులను చూశా. మృగాలను చూశా. తోడేళ్లను చూశా. అన్నింటినీ ఎదుర్కొని ఇంత దూరం వచ్చా, మానవ మృగాలు. మీరెంత? నా కాలు గోటితో సమానమని అన్నారు.