మావోయిస్టుల పేరుతో జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డిని బెదిరిస్తూ చేస్తూ లేఖను విడుదల చేసిన నకిలీ మావోయిస్టులను అరెస్టు చేసినట్టు మహబూబ్ నగర్ ఎస్పీ జానకి ధరావత్ తెలిపారు. మంగళవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఎస్పీ మాట్లాడుతూ. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై వ్యక్తిగత కక్షలతో ఆయనను భయభ్రాంతులకు గురి చేసే క్రమంలో ఈ లేఖను రంగారెడ్డి గూడ గ్రామంలో అంటించినట్లు ఎస్పి వెల్లడించారు.