మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణానికి చెందిన యువ బీఆర్ఎస్ నాయకుడు వరద భాస్కర్ పై 1 వ పట్టణ సీఐ వ్యవహరంపై ఆందోళనకు దిగారు. భాస్కర్ ను వీరన్నపేటలోని ఆయన ఇంటిలో పరామర్శించి వన్ టౌన్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.