వివిధ కారణాలతో రుణమాఫీ కాని 3. 14 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ. 2, 747 కోట్లు విడుదల చేసింది. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రజా విజయోత్సవ సభలో నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఆధార్, రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాల సమస్యలు పరిష్కరించి రుణమాఫీ పూర్తి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.