మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపి జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ ఆదివారం నారాయణగూడలోని కేశవరెడ్డి మెమోరియల్ స్కూల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్పస్వామి మహా పడిపూజకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అరుణ మణికంఠ స్వామిని దర్శించుకుని, మహా మంగళ హారతి తీసుకున్నారు. అయ్యప్ప భజన, భక్తి పాటలు అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు, అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.