జడ్చర్ల నియోజకవర్గం ఉద్దండపూర్ ప్రాజెక్టు సందర్శనకు బుధవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిలకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జనుంపల్లి అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.