కల్వకుర్తి నియోజకవర్గంలోని తుర్కలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వీరపాకుల ఎల్లయ్య (45) గురువారం వేపూరులోని వ్యవసాయ పొలంలో
ట్రాన్స్ ఫార్మర్ దించుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యారు. హుటాహుటిన కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ప్రస్తుతం మాజీ సర్పంచ్ ఎల్లయ్య మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంది.