నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ పట్టణంలో రాణి ఇందిరా దేవి పాఠశాల పూర్వపు విద్యార్థుల సమ్మేళనం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురువారం సినీ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మా తాతయ్య కొల్హాపూర్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మా మేనమామలు ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి, తదితరులు పాల్గొన్నారు.