వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ వస్తుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణయ్ తెలిపారు. మంగళవారం అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. గుండెపోటుకు మనిషి గురైనప్పుడు సిపిఆర్ ఎలా చేయాలో ఆయన అందరి సమక్షంలో మైనపు బొమ్మతో చేసి చూపించారు. 60 సెకండ్లు 30 సార్లు గుండెపై క్రమ పద్ధతిలో నొక్కాలని చూపించారు.