పాలమూరు జిల్లాను విద్యాక్షేత్రంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకం అయిన సమగ్ర శిక్ష అభియాన్ కింద రూ. 8. 26 కోట్ల నిధులతో డైట్ కాలేజీ ఆవరణలో బుధవారం పలు అభివృద్ధి పనులకు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ డైట్ కాలేజి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఊతమివ్వడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.