దేవరకద్ర: అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్య పదునెట్టాంబడి, మంగళారతులతో అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి దేవాలయం అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాల్గొన్నారు.