ఆత్మకూరు నుంచి ఏడుకొండల వరకు భారీగా ఊరేగింపు

54చూసినవారు
ఆత్మకూరు నుంచి ఏడుకొండల వరకు భారీగా ఊరేగింపు
ఆత్మకూరు: పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటి ఘట్టమైన అలంకార మహోత్సవం బుధవారం కనులపండువగా జరిగింది. ఆత్మకూరు నుంచి కురుమూర్తి కొండల వరకు స్వామి వారి స్వర్ణాభరణాల ఊరేగింపు భారీ భక్తజనుల మధ్య సాగింది. అలంకార మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు పట్టణం శోభాయమానంగా ముస్తాబైంది. ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రతినిధులు ముందు నడుస్తూ ఊరేగింపును కొనసాగించారు.

సంబంధిత పోస్ట్