మాగనూర్: ఫలించిన ఎమ్మెల్యే ప్రయత్నం

55చూసినవారు
పత్తి కొనుగోలు చేయాలని మంగళవారం మాగనూరు మండలం వడ్డేవాట్ గ్రామం వద్ద రైతులు రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కాటన్ మిల్లు యాజమాన్యంతో మాట్లాడారు. మిల్లు యాజమాన్యం పూర్తి స్థాయిలో పత్తి కొనుగోలు చేస్తామని చెప్పడంతో ఎమ్మెల్యే స్వయంగా పత్తి లోడుతో వున్న ట్రాక్టర్ ను మిల్లులోకి నడుపుకుంటూ వెళ్లారు. రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్