అంబులెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నూతనంగా మంజూరైన అంబులెన్సు సర్వీసులను జండా ఊపిరి ప్రారంభించారు. అనంతరం వాహనాన్ని స్వతహాగా నడిపించారు. బాధితులను చేరవేసేందుకు అంబులెన్స్ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అంబులెన్స్ మంజూరు చేయించడం పట్ల మండల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.