మక్తల్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం డిఎస్పీ లింగయ్య తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, పోలీసులకు అందించిన కిట్లు, ఆర్టికల్స్ పరిశీలించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని, స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.