ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడాన్ని నిరసిస్తూ బుధవారం మక్తల్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన బైక్ ర్యాలీకి నర్వ మండలం నుండి బీజేపీ నేతలు తరలి వెళ్ళారు. మండల కేంద్రంలో బైక్ ర్యాలీని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ అంటూ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. నాయకులు పాల్గొన్నారు.