నియోజకవర్గంలో వైద్యరంగం బలోపేతం చేసేందుకు అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్నామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం నర్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నూతన 108 అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు. ప్రజలు అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.