హాజరుకాకుంటే షోకాస్ నోటీసులు జారీ చేస్తాం: డీఈఓ

62చూసినవారు
నాగర్ కర్నూల్ లోని ఉన్నత పాఠశాలలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి 140 మంది ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారని, వారందరూ రేపటిలోగా మూల్యాంక విధులకు హాజరుకాకుంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని నాగర్ కర్నూల్ జిల్లా డీఈఓ గోవిందరాజులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధ, గురువారాల్లో ఎక్కువ ఉపాధ్యాయులు రిపోర్ట్ చేయకపోవటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్