రసూల్ చెరువు మరమ్మతులు చేపట్టాలి: కలెక్టర్

78చూసినవారు
అత్యంత పురాతనమైన చరిత్ర గల రసూల్ చెరువు మరమ్మతులకు కావలసిన వ్యయ ప్రణాళికలను వెంటనే రూపొందించి ప్రారంభించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణలు ఇరిగేషన్, అటవీ శాఖల అధికారులకు ఆదేశించారు. సోమవారం బల్మూర్ మండలంలోని బిళ్ళకల్ గ్రామ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న రసూల్ చెరువును పరిశీలించారు. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో అటవీశాఖ అధికారులు పనులు చేపట్టేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్