పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తు ముంపునకు గురైన పంప్ హౌజ్ ను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని మంత్రి జూపాల్లి కృష్ణారావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం నీట మునిగిన పంప్ హౌజ్ ను మంత్రి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. నీట మునిగిన పంప్ హోసే మోటార్లను పునరుద్ధరణ చేసి యధావిధిస్థితికి తేవాలని దిశానిర్ధేశం చేశారు.