జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా వున్న పోస్టులు భర్తీ చేయాలని పిఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కార్యదర్శి ప్రతాప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నారాయణపేట జిల్లా వైద్య శాఖ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందించారు. ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు లేక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారని చెప్పారు. సౌకర్యాలు కల్పించాలన్నారు.