నారాయణపేట మండలం సింగారం గ్రామంలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతుంది. వర్షకాలం విష జ్వరాలు, అంటువ్యాధులు సోకే సమయంలో ఇలాంటి కలుషిత నీరు ఏలా సరఫరా చేస్తారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇలా జరిగిందని, సంబంధిత అధికారులు స్పందించాలని, శుద్ధి చేసిన తాగునీటిని అందించాలి ప్రజలు కోరుతున్నారు.