నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అవినీతి అధికారిపై తక్షణమే విచారణ జరపాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం అంబేడ్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ధరణి సమస్యలు పరిష్కారం కావాలంటే కలెక్టర్ కార్యాలయంలో ఒక రెవెన్యూ ఉన్నతాధికారికి ముడుపులు ముడుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పేట అసెంబ్లీ అధ్యక్షులు హన్మంతు, తదితరులు పాల్గొన్నారు.