ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో సమర్థవంతంగా అమలు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం హైద్రాబాద్ నుండి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. ఈనెల 3 నుండి 8 వరకు పైలెట్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే చేపట్టాలని అన్నారు. ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని చెప్పారు.