హిందూ ముస్లింల మధ్య పోరాటంగా చిత్రీకరించడం సరైంది కాదు

76చూసినవారు
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ హిందూ ముస్లింల మధ్య పోరాటంగా చిత్రీకరించడం సరైంది కాదని సీపీఐ ఏంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి రాము అన్నారు. ఆదివారం నారాయణపేట భగత్ సింగ్ భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవ కర పత్రాలు విడుదల చేశారు. అనంతరం మాట్లాడారు. ఆనాటి భూస్వామి, రాచరిక, బానిసత్వం పై కమ్యూనిస్టులు పోరాటం చేశారని, లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు పంచి పెట్టారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్