మరికల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మండల సముదాయ భవన నిర్మాణ పనులను శనివారం సిక్తా పట్నాయక్ పరిశీలించారు. కాంప్లెక్స్ లో ఎన్ని కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు, నిర్మాణ వ్యయం ఎంత అని తహసీల్దార్ జమిల్ ను అడిగి తెలుసుకున్నారు. మండల భవన సముదాయం మోడల్ గా మారుతుందని చాలా బాగుందని కొనియాడారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని, పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. అధికారులు పాల్గొన్నారు