నారాయణపేట: ఘనంగా పీఆర్టియు ఆవిర్భావ దినోత్సవం

72చూసినవారు
నారాయణపేట: ఘనంగా పీఆర్టియు ఆవిర్భావ దినోత్సవం
పీఆర్టియు ఉపాద్యాయ సంఘం 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నారాయణపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ బీఈడీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. యూనియన్ కొరకు కృషి చేస్తూ పదవి విరమణ పొందిన వారికి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పీఆర్టియు పోరాటాలతో ఉపాధ్యాయులకు సంబంధించి అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని చెప్పారు. మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్