నారాయణపేట డీసీసీ కార్యాలయంలో సోమవారం జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సలీం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.