వనపర్తి జిల్లా ఆత్మకూరులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఓ ఆవు పందికి పాలు పట్టించింది. రోడ్డు పక్కన ఆవు పడుకొని ఉండగా పంది వచ్చి పాలు తాగింది. సాధారణంగా ఆవులు ఇతర జంతువులకు పాలు ఇచ్చేందుకు సుముఖత చూపవు. అయితే బిడ్డ ఆకలి తల్లికి తెలుసు అన్నట్టుగా ఆవు మాతృత్వాన్ని చాటింది. పందికి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తన పాలను పట్టింది. ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.