వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకుందని, దీంతో వర్షం కురిసినప్పుడు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు స్పందించి నూతన వసతి గృహాన్ని నిర్మించాలని బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్ కోరారు. శుక్రవారం వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.