వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి: మహేష్

566చూసినవారు
వనపర్తి జిల్లా పురపాలక పరిధిలో తాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చైర్మన్ పుట్టపాకల మహేష్ సోమవారం వాటర్ మెన్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవిలో వనపర్తి పట్టణంలో ఏ ఒక్కచోట కూడా నీటి సమస్య ఉండకూడదని, అసలు నీటి సమస్య ఏర్పడక ముందే తగిన జాగ్రత్తలు తీసుకొని సకాలంలో పట్టణ ప్రజలందరికీ నీటిని సకాలంలో అందించాలని వాటర్ లైన్మెన్ లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్