విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతోనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని వనపర్తి జూనియర్ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. రవికుమార్ అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలికల జూనియర్ కళాశాలలో లోక్ అదాలత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యతో పాటు దేశభక్తి, సేవాభావం అలవర్చుకోవాలని విద్యార్థులకు అయన సూచించారు.