వనపర్తి: కోటిలింగేశ్వర ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు

52చూసినవారు
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి శ్రీకోటిలింగేశ్వర దత్తదేవస్థానములో ఆదివారం సాయంత్రం సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతికి ప్రదోష కాలంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచామృతాలతో భస్మ గంధ కుంకుమ జలాలతో అభిషేకం జరిపి ధూపదీప నైవేద్యాలతో మంగళ హారతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేసుకొని మహాగణపతి అనుగ్రహం పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్