కన్నడ నటుడు కిచ్చా సుదీప్ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా ఆమె అంత్యక్రియలు ముగిశాయి. ఈ సందర్భంగా సుదీప్ దీనంగా కనిపించాడు. బరువెత్తిన గుండెతో వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.