వనపర్తి: మనస్తాపంతో వృద్ధుడు ఆత్మహత్య

50చూసినవారు
వనపర్తి: మనస్తాపంతో వృద్ధుడు ఆత్మహత్య
రామకృష్ణాపూర్ మండలం, పట్టణానికి చెందిన కడమంచి భీమరాజు(70) సింగరేణి విశ్రాంతి కార్మికుడు. గత కొంతకాలంగా భీమరాజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. మనస్తాపానికి గురైన భీమరాజు శనివారం తన ఇంటి ముందు షెడ్డులో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్