వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం సల్కలాపూర్ లో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శంకుస్థాపనకు గురువారం వచ్చిన ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డికి గిరిజన మహిళలు నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. డప్పుల వాయిద్యాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ సాంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యేఫై పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.