వనపర్తి జిల్లా కేంద్రంలోని 22 వ వార్డు మాజీ కౌన్సిలర్ సత్యం సాగర్ పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది శ్వేతా నగర్ లో శుక్రవారం డ్రైనేజీలను శుభ్రం చేశారు. మురుగు చెత్త, ప్లాస్టిక్ కవర్లు డ్రైనేజీల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. డ్రైనేజీల్లో కవర్లు, ఊడ్చిన చెత్త వేయవద్దని పట్టణ ప్రజలకు సూచించారు.