రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు పోతున్నామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రజాపాలన పేరిట అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.