మహాలక్ష్మి స్కీమ్ కాదు మహా ధోకా అని బీజేపీ నేత, ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. '6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మహిళలకు జరిగింది అన్యాయమే. రైతు భరోసా కాదు రైతులకు అరిగోస. ఆనాటి నుంచి నేటి వరకు అదే గోస. గృహజ్యోతి.. ఆరు పదుల చీకట్లకు సాక్ష్యం. ఇప్పటికీ అబద్ధాలతో నిర్లక్ష్యం చేస్తున్నరు. ఇప్పటికీ గూడు కరువైన పేదలు ఉన్నారంటే.. ఆరు పదుల కాంగ్రెస్ పాలన శాపమే అది. ఇండ్లు కాదు.. అవి పేదలకు కడగండ్లు' అని ట్వీట్ చేశారు.