న్యూజిలాండ్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. రివర్టన్ తీరంలో రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటన విడుదల చేసింది. న్యూజిలాండ్‌లోని దక్షిణ ద్వీపం పశ్చిమ తీరంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6 నుండి 6.9 మధ్య తీవ్రత ఉంటే అది భవనం పునాదిని పగులగొట్టగలదు.