లండన్‌లోని హీథ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మార్చి 22 వరకు విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్‌పోర్టులోని ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరగడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. 24 గంటల వరకు ప్రయాణికులెవరూ విమానాశ్రయానికి రావద్దని కోరారు.