రాష్ట్రంలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం ఎక్కువ శాతం బీర్ల తయారీ కంపెనీలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యాన్ని నూకగా మార్చి.. మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోని బీర్ల తయారీ కంపెనీలకు టన్నుల కొద్దీ సరఫరా చేస్తున్నారట. దొడ్డు బియ్యంతో గంజి శాతం అధికంగా ఉండటంతో మిగతా పదార్థాలతో కలిసి త్వరగా పులుస్తుంది. కాబట్టి తక్కువ ధరకు వస్తుండడంతో బెవరేజెస్ కంపెనీలు వాటి కొనుగోలు పై ఆసక్తి చూపుతున్నారట.