చోరీ అనుమానంతో తలకిందులుగా వేలాడదీశారు (VIDEO)

56చూసినవారు
రాజస్థాన్‌లోని బర్మేర్‌లో దారుణం చోటు చేసుకుంది. బైక్ దొంగతనం చేశాడన్న అనుమానంతో ఓ యువకుడిని గ్రామస్థులు చేతులు కట్టేసి, తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి భౌతిక దాడికి దిగారు. తాను ఆ బైక్ దొంగలించలేదని చెబుతున్నా వినిపించుకోలేదు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామస్థులపై కేసు నమోదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్