65 డిప్ అంగన్వాడీ కేంద్రంలో అక్షరభ్యాసం

65చూసినవారు
65 డిప్ అంగన్వాడీ కేంద్రంలో అక్షరభ్యాసం
బెల్లంపల్లి పట్టణంలోని 65 డిప్ ఏరియా -2 అంగన్వాడీ కేంద్రంలో శనివారం అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమం అక్షరభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు ఏండ్ల బాలుడు ఆరియాద్ ఖాన్తో అక్షరాలు దిద్దించారు. అనంతరం ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యూకేషన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కొంక పద్మావతి, ఆయా మంతెన ధనలక్ష్మి, చిన్నారుల తల్లిదండ్రులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్