ఆర్ఎంపీ పిఎంపీ ల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం

3419చూసినవారు
ఆర్ఎంపీ పిఎంపీ ల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం
బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి ని ప్రారంభోత్సవ మునకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావుకి బెల్లంపల్లి మండల అనుభవ వైద్యుల సంఘం తరపున మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే తమ సమస్యలను ఆరోగ్య మంత్రికి తెలియజేయడం జరిగినది. మెమోరాండం తీసుకొని సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావుకి ధన్యవాదములు తెలిపారు. 104, 108 వాహనాలలో అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఆర్ఎంపి, పిఎంపి లకు సమావేశ భవనము మంజూరు చేయించాలని, ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్రూం ఇప్పించగలరని, దళిత బంధ మాదిరిగా తమకు 20, 00, 000/-లు అందించి తమ జీవన భృతికి సహాయ సహకారం అందించగలరన్నారని కోరారు. మండల సంఘం తరుపున మెమోరాండం మంత్రికి అందజేసిన నూతన మార్కెట్ కమిటీ డైరెక్టర్ వైద్యులు పెద్దబోయిన శంకర్ కి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్ఎంపి, పిఎంపి వైద్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్