ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగుతోంది. దీంతో వేమనపల్లి మండల కేంద్రం నుంచి సుంపుటం, జాజులపేట, ముక్కిడిగూడం రూట్లలో రాకపోకలు నిలిచిపోయాయి. నీల్వాయి నుంచి రాచర్లకు వెళ్లే దారిలో హైలెవల్ వంతెన మునిగిపోయింది. సుంపుటం రూట్లో రెండు రోజుల నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు అట్టలొర్రె, అంకన్న ఒర్రె వంతెనలు దాటలేక ఇళ్లల్లోనే ఉండిపోయారు.