బెల్లంపల్లి పట్టణ గంగపుత్ర సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని గంగపుత్ర సంఘం బెల్లంపల్లి పట్టణ కన్వీనర్ మునిమంద రమేష్ స్పష్టం చేశారు. గురువారం బెల్లంపల్లి పట్టణం బూడిదగడ్డ బస్తిలోని ఆయన నివాసంలో 2025 గంగపుత్ర సంఘం క్యాలెండర్ ను పట్టణ అధ్యక్షుడు వంగల చక్రపాణి, జిల్లా నాయకులు బాసబోయిన పోతరాజు, దామెర సదానందం, కార్యవర్గ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.