తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘ భవనంలో పింఛన్ల దినోత్సవం మంగళవారం ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పెన్షన్స్ సాధించిన వ్యక్తి ధరమ్ స్వరూప్ నకార చిత్రపటానికి ఆ సంఘం అధ్యక్షుడు ఆనందచారి, కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకారే కృషి ఫలితంగానే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నామని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.