బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో రోడ్డుకు ఇరువైపులా తోపుడు బండ్లు, ఇతర వ్యాపారాలు చేసుకుంటున్న చిరువ్యాపారులకు ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ముందు బంకర్ ఏరియా ఖాళీ స్థలంలో విక్రయించుకోవడానికి స్థలం కేటాయించారు. ఈ మేరకు బుధవారం ఆస్ధలాన్ని మున్సిపల్ అధికారులు జేసీబీతో చదును చేయించారు. మార్కెట్ ఏరియాలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమీషనర్ శ్రీనివాసరావు,
తెలిపారు.