ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పాలన లోని రేవంత్ ప్రభుత్వ హయాంలో గుర్తింపు లభిస్తోందని తెలంగాణ ఉద్యమకారుడు ఎల్తూరి శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లిలో మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులను పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఆయనకు సమయం సరిపోయిందని పేర్కొన్నారు.